చక్కని అందం అభినయం ఉన్న కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీచ్చి మంచి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేయగల కథానాయికగా అక్కడ గుర్తింపు దక్కించుకున్నది సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. ఒకపక్క బోల్డ్ పాత్రలతో పాటు మరోవైపు క్రీడా నేపథ్య చిత్రాలతోనూ వరుస విజయాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మహిళా ప్రాధాన్య పాత్రలపైనే ఇటీవల కాలంలో ఆమె ఎక్కువ దృష్టిపెడుతున్నారు. దీనిపై స్పందిస్తూ ‘సక్సెస్ అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటుంది. నాకంటూ దానికి సొంత ఫార్మూలా ఉంది. హీరోల పక్కన కనిపించకపోవడం కొంతమంది ఫెయిల్యూర్‌గా భావించవచ్చు.
కానీ ప్రేక్షకులు ‘తాప్సీ సినిమా చూశాం. మాకు బాగా నచ్చింది’ అనుకుంటే చాలు. అదే నాకు సక్సెస్. కె రీర్ అనే రన్నింగ్ రేస్‌లో మనం ఒంటరిగా పరిగెట్టాలి కాబట్టి మన బెంచ్‌మార్క్స్, మన గోల్స్ మనమే సెట్ చేసుకోవాలి’ అంటూ సినిమాలతో పాటు తన లైఫ్ ఫిలాసఫీని వివరించారు తాప్సీ.