KGFతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ,పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో సలార్ సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా నిలిచిపోయింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న సలార్ సినిమా షూట్ మీద దృష్టిపెట్టబోతున్నాడట. ఇప్పటికే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా బ్యాలన్స్ షూట్‌కు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను మే మొదటి వారం హైదరాబాద్‌లో మొదలుపెట్టబోతున్నాట.
ఈ షెడ్యూల్ కంటిన్యూగా జరిపి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తుండగా.. హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.