Home / MOVIES / డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం విడుదలైన మూవీ KGF-2 లో ప్రధాన విలన్ పాత్రతో అందర్ని మెప్పించిన మోస్ట్ సీనియర్ నటుడు.. స్టార్ హీరో సంజయ్ దత్.ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,నటుడు సునీల్ దత్ వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు సంజయ్ దత్.

1981లో రాకీ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ నటుడు మున్నాభాయ్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. ప్రస్తుతం   క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గతంలో సంజయ్ దత్ తన సినిమా  కెరీర్ స్టార్టింగ్‌లో డ్రగ్‌కి బానిసయ్యాడనే విషయం అందరికి తెలిసిందే.

దాని కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డా ఈ నటుడు ఎట్టకేలకు ఆ దురలవాటు నుంచి బయటపడ్డాడు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో సజయ్ మాట్లాడుతూ దీని గురించి పలు ఆసక్తికర విషయాల గురించి చెబుతూ  ‘అప్పట్లో నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉండేది. అయితే మరోవైపు వాళ్లకి నచ్చేలా ఉండడానికి ప్రయత్నించేవాడిని. దాని కోసం డ్రగ్స్ వాడితే వారికి కూల్‌గా కనిపించడమే కాకుండా, వారితో సులువుగా మాట్లాడే అవకాశం ఉంటుందని భావించా. అందుకే డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టా’ అంటూ చెప్పుకొచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat