క్రికెటర్గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్ సింగ్ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు.
దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్ చేసిన హర్భజన్.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తాను ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్వీట్లో భజ్జీ పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ట్విటర్లో ఎంతో మంది భజ్జీ నిర్ణయానికి అభినందనలు తెలుపుతున్నారు.