పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించింది.
ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌మాన్ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే అంశాలను కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది.