పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా ఎన్నికలు ముగిశాయి.