కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార,తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధల్.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకర్స్ ఒక పాటకి సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేశారు.స్టార్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన టూ..టూ..టూ అంటూ సాగే సాంగ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉండబోతుందని గ్లింప్స్ వీడియోతో చెప్పారు మేకర్స్.
విజయ్ సేతుపతి ఓ వైపు సమంత, మరోవైపు నయనతార..ఇలా ఇద్దరు భామలతో కలర్ ఫుల్ సాంగ్ మాస్ స్టెప్పులేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.మీరు ఓ లుక్ వేయండి ఇక ఆలస్యం ఎందుకు.?