తెలంగాణ వ్యాప్తంగా తాను నిర్వహించే పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు బండి సంజయ్..
సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వచ్చాక పాత కేసులు తిరగదోడి ఆయన సంగతి చూస్తామని బండి హెచ్చరించారు. మజ్లిస్ అంటే కేసీఆర్కు భయమని ఆయన ఎద్దేవా చేశారు.