కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్ పటేల్ లేటెస్ట్గా చేసిన కామెంట్స్ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి.
ఇటీవల ఓ నేషనల్ మీడియా సంస్థతో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ ఏకంగా తమ అధినాయకత్వంపైనే విమర్శలు చేశారు. తనను పార్టీలో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీసీసీ మీటింగ్‌లకు పిలవడం లేదని.. ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు తనను అడగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయానికీ తనను పట్టించుకోనపుడు నాకిచ్చిన పదవికి విలువేముంటుందని అధిష్ఠానాన్ని హార్దిక్ నిలదీశారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై హార్దిక్‌పటేల్ ఇలా ఓపెన్ మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.