వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
