తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ… అందాల రాక్షసి ..బుట్టబొమ్మ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన గురించి ఎవరైన పొగుడుతూ’ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి’ అని హీరోయిన్ పూజా హెగ్దే అంటోంది.
స్టేజీపై ఎవరైనా ఎదురుగా నుంచొని తనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడి గురవుతానని తెలిపింది. ఆ పొగడ్తలను ఎలా తీసుకోవాలో తనకు తెలియదని చెప్పొకొచ్చింది. కానీ వాళ్ల మాటలు వింటున్నప్పుడు సరైన దారిలో ఉన్నానన్న సంతృప్తి కలుగుతుందని అంటోంది.