ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎండలో పార్క్ చేస్తే షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్పై ప్రభావం పడుతుంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు.
లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. టైర్లలో గాలి తగ్గడం, పగిలిపోయే అవకాశం ఉంది. అయితే కార్లను ఎండలో పార్క్ చేస్తే సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్ అమర్చాలి. దానంతట అదే తిరుగుతూ లోపల వేడిని తగ్గించేందుకు కొంత ఉపకరిస్తుంది.