2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టలకే తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో ఆర్సీబీ ను ఓడించింది.
ముందు ఆరంభంలో తడబడిన సీఎస్కే శివమ్ దూబె కేవలం 46బంతుల్లో ఎనిమిది సిక్సులు ,నాలుగు పోర్లతో 95* తో చెలరేగడంతో పాటు రాబిన్ ఉతప్ప యాబై బంతుల్లో నాలుగు ఫోర్లు.. తొమ్మిది సిక్సులతో ఎనబై ఎనిమిది పరుగులతో వీరవిహారం చేయగా మొదట చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్లకు మొత్తం ఇరవై ఓవర్లో 216 భారీ పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ మూడు ఓవర్లలో ముప్పైదు పరుగులిచ్చి రెండు వికెట్లను పడగొట్టగా మిగతావాళ్లంతా చెన్నై బ్యాట్స్ మెన్ల జోరుకు చేతులెత్తేశారు.
అనంతరం రెండోందల పదహారు పరుగుల లక్ష్యచేధనలో బరిలోకి దిగిన ఆర్సీబీ తొమ్మిది వికెట్లను కోల్పోయి కేవలం 193పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ జట్టులో షాబాజ్ అహ్మద్ ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లతో నలబై ఒక్క పరుగులు.. సూయాశ్ ప్రభ్ దేశాయ్ పద్దెనిమిది బంతుల్లో ఐదు ఫోర్లతో ఒక సిక్సరతో ముప్పై నాలుగు పరుగులు.. దినేశ్ కార్తిక్ పద్నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు.. మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులతో రాణించిన లాభం లేకపోయింది. చెన్నై జట్టులో తీక్షణ (4/33),జడేజా (3/39) రాణించారు.