RCB పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకున్న CSK కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్ మొదలైన దగ్గర నుండి వరుసగా నాలుగు ఓటములతో అభిమానులకు బాధపెట్టిన సీస్కే నిన్న మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఇరవై మూడు పరుగుల విజయంతో బోణి కొట్టిన చెన్నెకి గట్టి ఎదురు దెబ్బ ఇది.
జట్టులో ప్రధాన బౌలర్ అయిన దీపక్ చాహర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఫిబ్రవరి నెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ సమయంలో దీపక్ కు తొడ కండరాల గాయమైంది.
నెల రోజులకు పైగా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో చికిత్స పొందుతున్న దీపక్ కు తాజాగా వెన్నుగాయం అయింది. దీంతో ఏఫ్రిల్ రెండో వారానికల్లా జట్టులో చేరతాడని భావించిన కానీ ఈసీజన్ మొత్తానికి దూరం కావడం సీఎస్కే జట్టుకు గట్టి ఎదురు దెబ్బే. చూడాలి జట్టుకు చెందిన ప్రధాన ఫేసర్ బౌలర్ లేకుండా చెన్నై ఎలా నెట్టుకొస్తుందో మరి..?