తరచూ తన కామెంట్లతో వివాదాస్పదమయ్యే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఫేక్ ఫొటోను ట్విటర్‌ల పోస్ట్ చేసి వివాదాస్పదమయ్యారు. ఈరోజు ఉదయం దిగ్విజయ్ తన ట్విటర్ అకౌంట్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘ఆదివారం ఖర్గోవ్‌లో జరిగిన మతపరమైన హింస సమయంలో తీసిన ఫొటో’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు.
మసీదుపై కొంతమంది యువకులు కాషాయ జెండా పెడుతున్నట్లుగా ఉన్న ఆ ఫొటోను షేర్ చేశారు.కొద్దిసేపటికే అది ఫేక్ ఫొటో అని.. బిహార్‌లో తీసిన పాత ఫొటో అని తెలియడంతో దాన్ని వెంటనే తొలగించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దిగ్విజయ్ పోస్ట్‌చేసిన ఆ ఫొటో వైరల్ అయింది.
దీనిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలకు దిగ్విజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను సహించలేం అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు దిగ్విజయ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం