రాష్ట్రంలో 6 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కావేరి అనే అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్‌ఆర్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి జీవో 111ను ఎత్తివేస్తామని కేసీఆర్ తెలిపారు. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు.