ఏపీలో నూతనమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వాళ్లకు ఆయా శాఖాలను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన హోంశాఖను తానేటి వనితకు అప్పగించారు సీఎం జగన్.
మరో కీలకమైన వైద్యారోగ్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఆర్కే రోజాకు పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ కేటాయించారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి జగన్ కేటాయించారు.