ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
ఆ ఛైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్గా మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించనున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.