ఐటీ రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతోంది. 2021-22లో హైదరాబాద్ నుంచి రూ.1.67 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి.
అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.1.45 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొన్నేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది.
2026 నాటికి రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించి, 10 లక్షల మందికి IT రంగంలో ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.