దేశంలో కరోనా ప్రభావం స్వల్పంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు నమోదయ్యాయి.
29 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 85 లక్షల 70 వేల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.