దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం .
ఇందులో భాగంగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నారు.తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘కభీ ఈద్ కభీ దివాలీ’ త్వరలో సెట్స్ మీదకు రానున్నది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాలి.
కానీ ఈ మూవీకి బదులు కండల వీరుడు ..స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ .ఇదే అంశం గురించి హీరో సల్మాన్ బృందం చెబుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో.?