సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. పబ్‌ల నిర్వహణ విషయంలో పాటించాల్సిన నియమ నిబంధలపై యజమానులకు శ్రీనివాస్‌గౌడ్ దిశానిర్దేశం చేశారు. పోలీసుశాఖతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆబ్కారీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారని చెప్పారు. చట్టాన్ని అతిక్రమిస్తే అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయించేవాళ్లకు రాష్ట్రంలో చోటులేదన్నారు.
ఎన్నోత్యాగాలతో సాధించుకున్న తెలంగాణకు చెడ్డపేరు తెస్తే ఊరుకోబోమని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ వ్యవహారాల వెనుక ఎంతటి వాళ్లు ఉన్నా వదలొద్దని సీఎం స్పష్టంగా చెప్పారని.. సొంతపార్టీ వాళ్లు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొస్తే పబ్‌లు మూసేందుకు కూడా వెనుకాడబోమని చెప్పారు.