మీరు వయాగ్రా వాడుతున్నారా..?.. అయితే ఈ వార్త మీకోసమే.. మీరు చదవండి. సాధారణంగా అంగస్థంభన కోసం వినియోగించే వయాగ్రాతో చాలా సమస్యలున్నాయనంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువగా వయాగ్రా వాడితే కంటి చూపును కోల్పోయే ప్రమాదం చాలా ఉందని వారు చెబుతున్నారు. కెనాడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు చెబుతున్నారు.
వయాగ్రా వాడకంతో పురుషాంగానికి రక్తసరఫరా పెరుగుతుంది. ఈ సమయంలో కండ్లకు రక్తం సరఫరా అవ్వడం తగ్గుతుంది.దీంతో కంటి చూపును కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ప్రతి రోజూ వయాగ్రా వాడితే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని కూడా వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. దాదాపు 2.13లక్షల మందికిపైన జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ ఫలితాలు తెలియజేశారు.