దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,150 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనే 75 మంది కొవిడ్తో చనిపోయారు.
దేశంలో ప్రస్తుతం 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా కొవిడ్ డోసుల పంపిణీ జరిగింది.