Home / POLITICS / ‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్‌ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’

‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్‌ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. గవర్నర్‌ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కూడా గవర్నర్‌ కామెంట్స్‌పై రెస్పాండ్‌ అయ్యారు. గవర్నర్‌ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా ఘాటుగా స్పందించారు.

కేసీఆర్‌లా వ్యవహరించి ఉంటే శాసనసభ రద్దయ్యేదంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై సత్యవతి రాథోడ్‌ దీటుగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రొరోగ్‌ కానందునే బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించామన్నారు. బీజేపీ కార్యకర్తలాగే గవర్నర్‌ మాట్లాడినట్లు భావిస్తున్నామని విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat