ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు.
నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య నమ్రత ఇన్స్టా ద్వారా దీన్ని తెలియజేశారు. సొంత డబ్బులతో పిల్లల ప్రాణాలను కాపాడుతున్న మహేశపై ప్రశంసలు కురుస్తున్నాయి .