సబ్బండవర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. ఆయన కలలను నిజం చేయడంలో మనమంతా వారధులుగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి. సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజనుల సమగ్ర వికాసానికి పాల్పడింది ఎవరో ఆలోచించాల్సిన అవసరం గిరిజనలపై ఉందన్నారు. జిసిసి చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన వాల్యా నాయక్ జీసిసిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. జిసిసి గతంలో లాభదాయకంగా లేదు.
జిసిసి ఉద్యోగులుగా పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని, వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు.కార్యక్రమంలోమంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, జి.సి.సి మాజీ చైర్మన్ గాంధీ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు తదితరులు పాల్గొన్నారు