కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది
