ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధం ఆపేందుకు మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవల పుతిన్, జెలెన్ స్కీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఉక్రెయిన్లోని బుచాలో రష్యా సైనికుల ఊచకోతతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చలకు ససేమిరా అంటున్నారు.
