తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సీఎంఆర్ఎఫ్ నుండి రూ.4లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు.
ఈ ఎల్వోసీని నిన్న బుధవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు తరుణ్ కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా నిమ్స్ లో చికిత్స పొందుతున్న జిల్లెల కు చెందిన బర్ల పోచయ్య గుండె ఆపరేషన్ కోసం రూ.2లక్షల ఎల్వోసీని కూడా మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు.ఈ ఎల్వోసీని సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు బాధిత కుటుంబానికి అందజేశారు.