సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా తనను ఎంతో ప్రభావితం చేసిందని వరుణ్ చెప్పుకొచ్చాడు.
