ఇటు కేబినెట్‌లో అటు పార్టీలో కొందరు సమర్థులు కావాలని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ ప్రారంభంలోనే చెప్పారన్నారు.
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌కు తమ రాజీనామాలను సమర్పించామని చెప్పారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో సీఎం జగన్‌కు తెలుసని.. కేబినెట్‌లో ఐదు నుంచి ఆరుగురు మళ్లీ కొనసాగవచ్చని తెలిపారు. పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తామని కొడాలి నాని చెప్పారు. తనకు కొత్త కేబినెట్‌లో అవకాశం తక్కువగానే ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.