దేశంలోని ప్రముఖ జాతీయ పార్టీల్లో ఒకటైన బీజేపీకి.. 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘ్ మాతృపార్టీ. 1980 ఏప్రిల్ 6న దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్, మాజీ ఉప ప్రధాని LK అద్వానీలచే బీజేపీ స్థాపించబడింది..
1984 ఎన్నికల్లో కేవలం 2స్థానాల్లోనే గెలిచింది. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి, ఓట్ల శాతం పెంచుకుంటూ.. నేడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు 2014 నుంచి మోదీ ప్రధానిగా దేశంలో అధికారం కొనసాగిస్తోంది.