తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు .రంజాన్ మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గం లోని మసీదుల మరమ్మతులకై మైనార్టీల అభివృద్ధికి అనునిత్యం తోడ్పడే మంత్రి పువ్వాడ మరోసారి ముస్లిం మైనార్టీలపై తనకున్న అపారమైన గౌరవాన్ని , అభిమానాన్ని చాటారు.
ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు ఆర్థిక చేయూత అందించేందుకు మైనారిటీ వెల్ఫేర్ శాఖ వారిని ఆదేశించి, త్వరితగతిన ఆర్థిక చేయూత అందించాలని ఆదేశించారు.దీంతో ఖమ్మంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో తమ ఆనందాన్ని పంచుకొంటూమంత్రి పువ్వాడకు ఖమ్మం జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎండీ ఖమర్, నగర అధ్యక్షులు పగడాల .నాగరాజు ,నగర ప్రథాన కార్యదర్శి యం.డి ఇషాక్, నగర మైనారిటీ నాయకులు ,ఖిల్లా మాజీ. కార్పోరేటర్ షౌకత్ అలి , 23వ డివిజన్ కార్పోరేటర్ షేక్. మక్బుల్ , నగర ప్రచార కమిటీ కార్యథర్శి షేక్. షకీనా, షాదీ ఖానా డైరెక్టర్ సలీమ్ , అహ్మద్ , సుడా డైరెక్టర్ షేక్ ముక్తార్, నగర మైనారిటీ అధ్యక్షులు యం.డి శంషుద్ధిన్, నగర మైనార్టీ కోశాధికారి షేక్ తాజుద్దీన్,దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్. సిధ్ధాసాహేబ్ , షేక్ ఉస్మాన్ , షమీఉద్దీన్ ,మైనారిటీ 2టౌవున్ ఇన్ చార్జీ షేక్ అబ్బాస్ ,మైనారిటీ నాయకులు ,57వ డివిజన్ ప్రథాన కార్యదర్శి షేక్. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.