కుల రహిత సమాజం కోసం పాటుపడి, దళితుల అభ్యున్నతి కోసం అనేక సేవలను అందించిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నందు నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారితో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ దళితులు, ఇతర వర్గాల కోసం పార్లమెంటులో కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన మహా నాయకుడు జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమైన విషయామన్నారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు అని దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయం అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ గారు ఎనలేని కృషి చేశారని గుర్తుచేసి, వారి సేవలను స్మరించుకున్నారు.