వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.