ప్రగతి భవన్‌లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేస్తున్నారు.
