మంత్రి పదవులపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు.
దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ వారసుడిగా చెలామణి అవుతున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని నారాయణస్వామి సవాల్ విసిరారు. చంద్రబాబు అలా గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.