జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
తన రాజకీయ ప్రవేశం గురించి చాలా మంది అడుగుతున్నారని.. కానీ భవిష్యత్ గురించి తాను నమ్మనని చెప్పారు. ఈ క్షణాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తానని.. భవిష్యత్ గురించి ఆలోచించనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యాక్టర్‌గా తన జర్నీని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
తన తాత ఎన్టీఆర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. సొసైటీ ఎంతో ఇస్తుందని.. మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలనే సూత్రాన్ని తాత నుంచే నేర్చుకున్నానని చెప్పారు. తనతో బ్లడ్ రిలేషన్ కాకపోయినా ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారని.. ఏం చేస్తే వాళ్ల ప్రేమను తిరిగి ఇవ్వగలనని ప్రశ్నించారు. మంచి సినిమాలు చేస్తూ వాళ్లని గర్వపడేలా చేస్తుంటానని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.