ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి.
తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు. ఆ బస్సుల్లో రూ.5కోట్ల 60లక్షల క్యాస్, 10 కేజీల 10 గ్రాముల గోల్డ్ దొరికింది. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి వద్ద కూడా ఈ ఉదయం పోలీసుల తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో ఓ ట్రావెల్స్ బస్సులో సుమారు రూ.5కోట్ల క్యాష్, సుమారు 350 గ్రాముల బంగారం లభించింది. ఆ బస్సు విజయనగరం నుంచి గుంటూరు వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.