క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్ నిర్వహణ చూసే ‘బుక్‌షో’ ప్రకటించింది.
ఏప్రిల్ 2 నుంచి అన్నిరకాల కరోనా రూల్స్‌ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 6 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీకి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు బుక్ మై షో తెలిపింది. మహారాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, ఎంసీఏ స్టేడియాల్లో మాత్రమే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.