మండుటెండల్లో చెరువుల్లో.. చెక్ డ్యామ్ ల్లో మత్తళ్లు దుంకుతున్న చరిత్ర నేటి తెలంగాణ ప్రభుత్వం లో..సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో అవిష్కృతం అయిందని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో గంగమ్మ దేవాలయ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరిశ్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తే ఎండాకాలం..కానీ గంగమ్మ ఒడిలో చిన్నకోడూర్ చెరువులో గోదారమ్మ జలకళను చూస్తే సంతోషంగా ఉందన్నారు.. చిన్నకోడూర్ చెరువు ఇప్పుడు ఉన్న 60 ఏళ్ల వయస్సు వారు కూడా ఒక సారి ఎప్పుడో 30 ఏళ్ల కింద చూసారట మళ్ళీ ఈ చెరువులో నీళ్లు ఇప్పుడు చూస్తున్నారన్నారు..నాడు ఏ కాలం అయిన ఎండా కాలమే.. చెరువులు నిండేవి కావు.. నేడు ఏ కాలం అయిన నిండు కుండల్లా చెరువుల్లో జలకళ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఒక చెరువు నిండేది కాదు.. ఒక ఎకరం నీళ్లు ఉండేవి కావని గుర్తు చేసారు. నేడు ప్రతి చెరువు నిండా గోదావరి జలాలు.. ప్రతీ ఎకరానికి సాగు నీరు.. మొగులుకు మొహం పెట్టె రోజులు రావు..తరతరాల కు కనిపించే కాళేశ్వరం నీళ్లు వచ్చాయని చెప్పారు.. తెలంగాణ రావడం ముఖ్యమంత్రి గా కేసీఆర్ గారు, నీళ్ల మంత్రి గా నేను ఉండటం మన చిన్నకోడూరు చెరువు లో నీళ్లు వచ్చాయన్నారు..నెత్తి మీద గంగమ్మ ల చిన్నకోడూర్ నెత్తి మీద రంగనాయక సాగర్ తో మన ప్రాంతం జలకళ సంతరించుకుంది ..మనకు కాలం తో పని లేదు..ఉద్యమ స్పూర్తితో రంగనాయక సాగర్ నిర్మించుకున్నాం.. కాలం అయిన కాకున్నా తరతరాలుగా నిలిపోయే గొప్ప పని మనం చేసుకున్నాం.. 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం లో ఒక్క చుక్క నీళ్లు లేవు ఒక్క ఎకరం నికి నీళ్లు లేవు..
నాడు ఏ చెరువు చూసిన ఎండాకాలం వచ్చింది అంటే చాలు క్రికెట్ గ్రౌండ్లు అయ్యేవి..నేడు నిండు కుండాల ఎప్పుడు నీళ్లతో కళకళలాడుతూన్నాయ్.. ఎప్పుడు చూసిన నీళ్లు నిండే ఉంటాయన్నారు.ఉద్యమ స్ఫూర్తి తో పని చేయడం వల్లే త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి ఒక్క పూట, రోజు, సంవత్సరం కోసం చేపట్టిన కార్యక్రమాలు కాదు…తరాలు పాటు నిలుస్తూ… రైతులు, పేద ప్రజలు తలరాతలు మార్చే ప్రాజెక్ట్ కాళేశ్వరంగతంలో నిండక పోయేది….ఇప్పుడు ఇక ఎండకాలం కాకపోయినా…. సాగు, త్రాగునీటి కి ఇక గోస ఉండదు. చెరువుల జల కళతో… చేపల వృద్ధి పెరిగింది. మత్యకారులకు ఆదాయం పెరిగింది. ఉగాది ఎల్లంగనే 57 సంవత్సరాలు నిండి అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తాం.మీ గంగపుత్రులు ఏ పని ఉన్న. ఏ అవసరం ఉన్న అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్థానని చెప్పారు.. మీరు చూపిన ప్రేమ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అందరికి శుభం చేకూరాలని కోరుకున్నారు..