యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్ వెహికిల్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల వివరాలను కూడా ఆమె వెల్లడించారు. ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు సుప్రభాత సేవ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య బ్రేక్ దర్శనం, ఉదయం 10 గంటల నుంచి 11.45 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.