తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్ కు చెందిన కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న బుధవారం నగరంలో టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ముఖ్యంగా బీసీలంటే రేవంత్ రెడ్డికి చులకన భావం. ఆయన వెంటనే వాళ్లకు భేషరత్ గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీల కులగణన గురించి పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పొరాడుతుంటే వాళ్ల పోరటాన్ని అవమానిస్తూ మాట్లాడిన అనుముల రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. రేవంత్ రెడ్డికి బీసీ ప్రజలు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. కనీసం విషయ పరిజ్ఞానం లేని రేవంత్ ను ప్రజలు చీదరించుకుంటున్నారు అని ఆయన అన్నారు. ఏపీ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. రేపు తెలంగాణలో కూడా అవుతుందని ఆయన అన్నారు.