దాదాపు ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ కి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ క్రేజీ హీరోయిన్ కృతీ సనన్. సూపర్ స్టార్ మహేశ్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేసిన దోచేయ్ సినిమా కూడా పరాజయాన్ని మూటగట్టుకుంది.
అప్పటి నుంచి మళ్ళీ అమ్మడికి తెలుగులోనే కాదు.. ఏ ఇతర సౌత్ భాషలలోనూ అవకాశాలు దక్కలేదు.అయితే, కృతీ సనన్‌కు హిందీ సీమలో మాత్రం మంచి క్రేజే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వాస్తవంగా కియారా అద్వానీని నటింపజేయాలని మేకర్స్ భావించారు. కానీ, తన డేట్స్ లేకపోవడంతో కృతి సనన్ వైపు మేకర్స్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.