ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యొక్క అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు.
కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార నివాసం గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ బారికేడ్లను దాటుకొని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.