గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై బాంబుల దాడి కురిపిస్తున్న సంగతి విదితమే. అయితే మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా -ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొట్టమొదటి సారిగా సానుకూలంగా ముగిశాయి. ఇందులో భాగంగా రష్యా కీవ్ లో ఉన్న తమ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా చేస్తున్న దాడులను తగ్గించింది రష్యా.
అయితే యుద్ధం ప్రారంభమై ముప్పై నాలుగురోజులైన ఉక్రెయిన్ పై పైచేయి సాధించలేని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సేనలు చివరకు రాజీమార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోవడమే కాకుండా అరవై ఐదు కిలోమీటర్ల పొడవున్న యుద్ధ కాన్వాయ్ ను ఉక్రెయిన్ ప్రత్యేక రక్షణ దళం తాజాగా ధ్వంసం చేయడం ఇర్పిన్ వంటి కీలక నగరాలను ఉక్రెయిన్ తిరిగి రష్యా సేనల నుండి హస్తగతం చేసుకోంటుంది..
రష్యాపై అంతర్జాతీయ దేశాలు విధిస్తున్న అంక్షలు నేపథ్యంలో రష్యా దిగి రావడానికి ప్రధాన కారణాలు అని విశ్లేషకులు చెబుతున్నారు. ముందు ఎగదోసి తర్వాత ఏ దేశం కూడా తమకు సహాకరించకపోవడం. దేశంలో ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరుగుతుండటంతో ఉక్రెయిన్ కూడా ఒక మెట్టు కిందకు దిగినట్లు తెలుస్తుంది. అందుకే రష్యా కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.