కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులు చేసుకునే వారిని భయపెట్టాలని చూస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నీరా డ్రింక్స్‌పై సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేసి వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ప్రజలు వివరిస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.