RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్ అని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇకపై తన కెరీర్ ట్రిపుర్ ఆర్‌కి ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తారక్ చెప్పారు.
ఒక యాక్టర్‌గా ఇప్పటివరకు తాను చేసిన దానికంటే RRRలో ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చిందని ఎన్టీఆర్ చెప్పారు. మూవీలో తన ఇంట్రడక్షన్ సీన్స్ చూస్తే భీమ్ గురించి పూర్తి అవగాహన వచ్చేలా దర్శకుడు రాజమౌళి ఆ షాట్స్‌ను తీశారన్నారు. ప్రేక్షకుల ఎంజాయ్‌మెంట్‌ను యూట్యూబ్‌లో చూస్తున్నానని.. ఇంతమంది పల్స్‌ని జక్కన్న ఎలా పట్టుకుంటాడా? అని ఆశ్చర్యపోతున్నానని చెప్పారు.
తన దృష్టిలో సినిమాలంటే ఫస్ట్ ప్రశంసలు, సెకెండ్ రివ్యూలు, లాస్ట్ నెంబర్లు (సినిమా కలెక్షన్లు) అన్నారు. కలెక్షన్స్ కు చివరి ప్రయారిటీ ఎందుకంటే వాటితో తనకు ఎలాంటి సంబంధం ఉండదని ఎన్టీఆర్ తెలిపారు.