కేరళలోని కూడల్ మాణిక్యం దేవాలయంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో జరిగే జాతీయ నాట్య వేడుకల్లో నాట్యం చేసేందుకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి మన్సీయకు అనుమతి నిరాకరించారు.
తనకు ఎదురైన సంఘటనను.. అనుభవాన్ని సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ వేదికగా మన్సీయ తెలుపుతూ తాను హిందువు కాదని..హిందూయేతరులను దేవాలయంలోకి అనుమతించబోమని వారు చెప్పినట్లు వివరించారు.
తాను ముస్లీం కుటుంబంలో పుట్టానని..ప్రస్తుతం ఏ మతాన్ని నమ్మడం లేదని ఆమె చెప్పారు. కాగా శాస్త్రీయ నాట్యంలో పీహెచ్డీ పూర్తి చేశారు. కూడల్ మాణిక్యం దేవాలయంలో ఏఫ్రిల్ పదిహేనునుండి ఇరవై ఐదు తారీఖు వరకు జాతీయ నాట్య,సంగీత వేడుకలు జరగనున్నాయి.